Friday, 19 August 2016


And I am not going to tag her , she knows what she has to do !!! @ PV SINDHU 


రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ లో రజత పతకాన్ని ఖాయం చేసుకున్న భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. శుక్రవారం జరిగే తుదిపోరులో సింధు విజయం సాధించి బంగారు పతకాన్ని తీసుకురావాలని భారత షూటర్ అభినవ్ బింద్రా ఆకాంక్షించాడు. ఒలింపిక్స్ లో సింధు పసిడి సాధించి తనతో జాయిన్ కావాలంటూ బింద్రా కోరాడు.  ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్న బింద్రా.. ఆ క్లబ్ లో తాను ఒక్కడినే ఉన్న సంగతిని గుర్తు చేసుకున్నాడు.

2008 బీజింగ్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణం పతకం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో భారత్ కు స్వర్ణం రాలేదు. ఆ తరువాత ఇన్నాళ్లకు సింధు స్వర్ణానికి అడుగు దూరంలో నిలవడంతో ఆ ఘనతను సాధించాలని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లు సింధు స్వర్ణ పతకంపై ధీమా వ్యక్తం చేశారు. తుదిపోరులో సింధు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.  ఇప్పటివరకూ సింధు ప్రదర్శన ఆద్యంత అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.

గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై ఘనవిజయాన్ని నమోదు చేసింది. దీంతో శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీకి సిద్ధమైంది.

No comments:

Post a Comment